కలం, వెబ్ డెస్క్: విద్యార్థి సమస్యలపై సీజేపీ (CJP) చేపడుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో శుక్రవారం సీజేపీ ప్రతినిధులతో కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీకి కేంద్ర మంత్రి జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. సీజేపీ పక్షాన సౌరవ్ దాస్ (Saurav Das) నేతృత్వంలోని ప్రతినిధుల బృందం పాల్గొంది. విద్యార్థుల భవిష్యత్తు, విద్యావ్యవస్థలో తలెత్తిన సమస్యలపై ఈ సమావేశంలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగాయి.
తమ డిమాండ్లన్నీ పూర్తిగా నెరవేరే వరకు ఆందోళనలను విరమించే ప్రసక్తే లేదని సీజేపీ (CJP) ప్రతినిధి సౌరవ్ దాస్ తేల్చి చెప్పారు. విద్యావ్యవస్థలో చోటుచేసుకున్న వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని గట్టిగా పట్టుబట్టారు. సీజేపీ నాయకులు తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ లభించే వరకు పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది. పేపర్ లీక్పై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు లీకేజీపై ప్రత్యేక బిల్లులు తెచ్చే అవకాశం ఉంది.
Read Also: నీట్ లీక్పై సుప్రీం సీరియస్: కేంద్రం, ఎన్టీఏలకు నోటీసులు!
Follow Us On : WhatsApp

