కలం, వెబ్ డెస్క్: పరీక్షా పేపర్ లీకులపై కేంద్రం హామీతో దీక్ష విరమించిన సామజిక కార్యకర్త సోనమ్ వాంగు చుక్ (Sonam Wangchuk) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఉదయం వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు చేశారు. నీట్ పేపర్ లీకేజీ, పరీక్షా విధానంలో జవాబుదారీతనం, పరీక్షా నిర్వహణ విధివిధానాలపై పార్లమెంట్ లో చర్చిస్తామని కేంద్రం లిఖితపూర్వక హామీ ఇచ్చిందని.. అందుకే దీక్ష విరమిస్తున్నట్లు తెలిపారు. శాంతియుతంగా ఆందోళన చేస్తోన్న విద్యార్థులపై ఎలాంటి కేసులు పెట్టబోమని కేంద్రం చెప్పిందని అన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చిందని వీడియోలో చెప్పుకొచ్చారు.
అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండానే తన నిరాహార దీక్షను విరమించడంపై సోనం వాంగ్చుక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకరి రాజీనామా వల్ల కలిగే నష్టం కంటే, ఇప్పుడు బీజేపీకి జరుగుతున్న నష్టం చాలా ఎక్కువ అని అభిప్రాయపడ్డారు. తన ప్రాణం విలువైనదని అందరూ చెప్పారని. అందుకే తాను నిరాహార దీక్షను విరమించానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ ఉద్యమంలో లక్షలాది మంది బాగస్వామ్యులయ్యారు. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపై సోనం అత్యంత కీలక పాత్ర పోషించారనడంలో సందేహం లేదని వ్యాఖ్యానించారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఎప్పుడు డిమాండ్ చేయాలి లేదా నిరసనను ఎప్పుడు ముగించాలనే నిర్ణయం ఇక పూర్తిగా సోనం చేతుల్లో లేదని చెప్పుకొచ్చారు. ఈ నిరసన ఇప్పుడు పూర్తిగా ‘జెన్-జెడ్’ యువత ఉద్యమంగా మారిందన్నారు.
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ గురువారం అర్ధరాత్రి నిరాహార దీక్ష విరమించారు. గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో పండ్ల రసం తాగి దీక్షను విరమించారు. కాగా, నీట్ పేపర్ లీకేజీలపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని గత 26 రోజులుగా సోనమ్ వాంగ్ చుక్ నిరహార దీక్ష చేస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి మరింత విషమం కావడంతో మంత్రులు ఆయనచే దీక్ష విరమింపజేశారు.

