epaper
Sunday, March 1, 2026
epaper

బాసర ఆలయ ఇన్ చార్జ్​ ఈవోగా విజయ రామారావు

కలం, నిజామాబాద్ బ్యూరో : నిర్మల్ (Nirmal) జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ (Basara Temple) ఇన్ చార్జ్ కార్యనిర్వహణాధికారి (ఈవో)గా విజయ రామారావు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈవోగా ఉన్న అంజనీదేవి సుదీర్ఘ సెలవుపై వెళ్లడంతో, ప్రభుత్వం ఈ అదనపు బాధ్యతలను ఆయనకు అప్పగించింది.

గతంలో కూడా విజయ రామారావు బాసర ఆలయ (Basara Temple) ఇన్ చార్జ్ ఈవోగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ గా బదిలీపై వెళ్లారు. ఇప్పుడు తిరిగి పాత స్థానానికే రావడంతో ఆలయ సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా విజయ రామారావుకు ఆలయ ఏఈఓ గంగా శ్రీనివాస్, ప్రధాన అర్చకులు సంజీవ్ మహారాజ్, ఆలయ సూపరింటెండెంట్ లక్ష్మణ్, సీనియర్ అసిస్టెంట్లు లడ్డు గంగాధర్, సుధాం రాజేందర్ తదితరులు ఘన స్వాగతం పలికారు. సరస్వతీ అమ్మవారి సన్నిధిలో సేవ చేసే అవకాశం రావడం తన అదృష్టమని ఈ సందర్భంగా విజయ రామారావు సంతోషం వ్యక్తం చేశారు.

Read Also: అంబులెన్స్ రాలేదు.. ఎడ్లబండిపై భార్యను తీసుకెళ్లిన భర్త..

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!