Mobile Popup Ad
Mobile Popup Ad

జైలర్ 2 నుంచి బాలకృష్ణ తప్పుకున్నారా?

Jailer 2 | రజనీకాంత్‌ నటించిన జైలర్ ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో శివరాజ్‌కుమార్‌, మోహన్‌లాల్‌ ప్రత్యేక పాత్రలు పోషించారు. ఇక అనిరుధ్ మ్యూజిక్, బీజీఎం వేరే లెవల్. అంత సక్సెస్ అయిన ఈ మూవీకి సీక్వెల్ తీయబోతున్నారు. అయితే సీక్వెల్ లో తెలుగు స్టార్ హీరో బాలకృష్ణ(Balakrishna) నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని బాలకృష్ణను తీసుకున్నట్టు తమిళ మీడియాతో వార్తలు వచ్చాయి.

అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. బాలకృష్ణ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు సమాచారం. బాలకృష్ణ ప్లేస్ లోకి విజయ్ సేతుపతి(Vijay Sethupathi)ని తీసుకున్నట్టు తెలిసింది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా, సోషల్‌మీడియాలో ఈ వార్త భారీగా వైరల్ అవుతోంది. విజయ్‌సేతుపతి ఇప్పటికే అనేక భిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అలాంటి ఆయన రజనీకాంత్‌(Rajinikanth)తో కలిసి ఏ విధమైన పాత్రలో కనిపిస్తారన్న ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం ‘జైలర్‌ 2(Jailer 2)’ షూటింగ్‌ వేగంగా కొనసాగుతోంది. రజనీ మోత్‌వేట్‌ పాండియన్‌ పాత్రకు ఈసారి మరింత శక్తివంతమైన కథా నేపథ్యం సిద్ధమవుతోందని చిత్ర వర్గాల సమాచారం. సినిమా కోసం భారీ సెట్‌లు నిర్మించగా, యాక్షన్‌ సన్నివేశాలు కూడా విస్తృతంగా తెరకెక్కుతున్నాయి.

Read Also: ‘అవతార్-3’ కోసం 12 లక్షల మంది రెడీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>