epaper
Monday, March 2, 2026
epaper

‘అవతార్-3’ కోసం 12 లక్షల మంది రెడీ

కలం డెస్క్ : జేమ్స్ కామరూన్ డైరెక్షన్‌లో డిసెంబరు 19న విడుదల కానున్న ‘ఫైర్ అండ్ యాష్’ (Fire and Ash) పేరుతో వస్తున్న అవతార్-3 (Avatar 3) మూవీని చూసేందుకు ఇండియన్స్ ఉవ్విళ్ళూరుతున్నారు. ఇంగ్లీష్, హిందీతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లోనూ ఇది రిలీజ్ అవుతున్నది. ‘బుక్ మై షో’ (Book my Show) ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటికే ఈ చిత్రాన్ని చూడడానికి ఆసక్తి (ఇంట్రెస్ట్) కనబరుస్తున్నట్లు 12 లక్షల మంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిత్రం రిలీజ్ కావడానికి కొన్ని రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే అవకాశాలున్నాయి.

జేమ్స్ కామరూన్(James Cameron) డైరెక్షన్‌లో ఇప్పటికే రిలీజైన అవతార్ (ఫస్ట్ పార్ట్) ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. సెకండ్ పార్ట్ గా వచ్చిన ‘అవతార్ – ది వే ఆఫ్ వాటర్’ (Avatar-2 The way of Water) 2022లో దాదాపు 160 భాషల్లో విడుదలైంది. అత్యధిక వసూళ్ళు సాధించింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్‌లో దాదాపు రూ. 500 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు మూడవ భాగం విడుదలకు రెడీ అవుతున్నది. శామ్ వర్తింగ్టన్, జో సల్దానా, సిగోర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్ లెట్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. చిత్రం విడుదలకు డేట్ దగ్గర పడుతుండడంతో ప్ర్రేక్షకులు ‘బుక్ మై షో’ యాప్‌లో ఈ సినిమాను చూడాలనే ఆసక్తిని కనబరిచారు. వారి పేర్లను నమోదు చేసుకున్నారు. అవతార్ థర్డ్ పార్ట్(Avatar 3) లో సాహస సన్నివేశాలు భారీ స్థాయిలోనే ఉంటాయని, భావోద్వేగ దృశ్యాలు కూడా ఎక్కువగానే ఉంటాయని డైరెక్టర్ జేమ్స్ కామరూన్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.

గతంలో సలార్, పుష్ప-2, బాహుబలి-2, లియో, కేజీఎఫ్, విక్రమ్, ఆదిపురుష్, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 తదితర చిత్రాలకు కూడా దాదాపు 10 లక్షల మంది బుక్ మై షో ద్వారా రిజర్వు చేసుకుని చూశారు.

Read Also: ఓటీటీలోకి ది గర్ల్‌ఫ్రెండ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!