epaper
Monday, March 2, 2026
epaper

రోహిత్ రికార్డ్.. వన్డేల్లో నెంబర్ వన్ అతడే

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డేలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(Rohit Sharma) రికార్డ్ సృష్టించాడు. వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా టాప్ పొజిషన్ అందుకున్నాడు. ఆదివారం రాంచీ వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బౌలర్ ప్రేనెలన్‌ సుబ్రాయెన్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. దీంతో రోహిత్ పేరిట రికార్డ్ నమోదయింది. దీంతో ఇప్పుడు వన్డేల్లో రోహిత్ కొట్టిన సిక్స్‌ల సంఖ్య 352కి చేరింది. దీంతో వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన వారిలో టాప్‌లో ఉన్న పాక్ బ్యాటర్ షాహిద్ అఫ్రిదీ రికార్డ్‌ను అధిగమించాడు.

వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన వారు వీరే..
1. Rohit Sharma (భారత్‌)- 352* సిక్స్‌లు
2. షాహిద్‌ అఫ్రిది (పాకిస్థాన్‌) – 351 సిక్స్‌లు
3. క్రిస్‌గేల్‌ (వెస్టిండీస్‌)- 331 సిక్స్‌లు
4. సనత్‌ జయసూర్య (శ్రీలంక)- 270 సిక్స్‌లు
5. ఎంఎస్‌ ధోని (భారత్‌)- 229 సిక్స్‌లు

ఈ ఘనతను రోహిత్‌ 269 ఇన్నింగ్స్‌లలోనే సాధించడం విశేషం. క్రమంగా సిక్స్‌లతో బౌలర్లను భయపెట్టే హిట్టింగ్‌ స్టైల్‌ రోహిత్‌ బ్రాండ్‌మార్క్‌గా మారింది. ఈ రికార్డ్‌తో హిట్‌మ్యాన్‌ తనదైన శైలిలో మరోసారి క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.

Read Also: ‘అవతార్-3’ కోసం 12 లక్షల మంది రెడీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!