విజయ్ ప్రమాణ స్వీకార తేదీ ఖరారు

కలం, వెబ్ డెస్క్: టీవీకే చీఫ్ విజయ్(Vijay)కి ఎట్టకేలకు ఆటంకాలు తొలగిపోయాయి. ఆయన రేపు (ఆదివారం) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా తమిళనాడులో కీలక పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు విజయ్ నేతృత్వంలోని టీవీకే (Tamilaga Vettri Kazhagam) ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆదివారం సాయంత్రం 3 గంటలకు చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

120కి చేరిన టీవీకే బలం

టీవీకేకు కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం మద్దతు ఇప్పటికే లభించగా.. తాజాగా వీసీకే, ఐయూఎంఎల్ కూడా బేషరతు మద్దతు ప్రకటించడంతో విజయ్ బలం 120కు చేరింది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్‌ను విజయ్ కలిశారు. ఈ నేపథ్యంలో తాజా మద్దతుతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. తమిళనాడులో దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే-అన్నాడీఎంకే ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా టీవీకే ఎదగడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరోవైపు టీవీకే శ్రేణులు పార్టీ కార్యాలయాల వద్ద టపాసులు పేల్చి సంబురాలు నిర్వహిస్తున్నాయి. అభిమానులు విజయ్ పోస్టర్లకు పాలాభిషేకాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రమాణస్వీకార కార్యక్రమంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>