జననాయగన్ లీక్.. ఆరుగురి అరెస్ట్

కలం, వెబ్ డెస్క్:  టీవీకే అధినేత, ప్రముఖ హీరో విజయ్ నటించి జననాయగన్ (Jana Nayagan) మూవీ విడుదలకు ముందు ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలైతే తన రాజకీయ భవిష్యత్ కు ఉపయోగపడుతుందని విజయ్ ఆశించారు. కానీ సెన్సార్ సమస్యల కారణంగా ఈ మూవీ విడుదల కాలేదు. కాగా తాజాగా ఈ మూవీ విడుదలకు ముందే లీక్ కావడం వివాదంగా మారింది. సినిమా ఆన్‌లైన్‌లో లీక్‌ కావడంతో చిత్రబృందం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వారి ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు.

చిత్రబృందం తరఫున న్యాయవాది స్పందిస్తూ.. ‘లీక్‌కు బాధ్యులైన వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. సోషల్‌ మీడియాలో ఈ సన్నివేశాలను డౌన్‌లోడ్‌ చేయడం, షేర్‌ చేయడం, ఫార్వర్డ్‌ చేయడం వంటి చర్యలపై కూడా కఠిన చర్యలు ఉంటాయి’’ అని హెచ్చరించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కొన్ని డిజిటల్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. విజయ్‌ కెరీర్‌లో చివరి చిత్రం కావడంతో ‘జననాయగన్‌’ (Jana Nayagan) పై భారీ అంచనాలు ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>