Mobile Popup Ad
Mobile Popup Ad

విజయ్ సర్కార్ పై సస్పెన్స్.. గవర్నర్ తీరుపై హీరో విశాల్ ఫైర్

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులో విజయ్ సర్కార్ పై సస్పెన్స్ నెలకొంది. 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా విజయ్ నేతృత్వంలోని TVK (తమిళ వెట్రి కజగం) అవతరించిన .. మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు సాధించలేదని విజయ్ సర్కార్ ఏర్పాటు కు గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో తమిళనాడు గవర్నర్ తీరుపై తమిళ నటుడు విశాల్ ( Vishal) ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీకేకు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

గతంలో 2017-18లో గోవా, మణిపూర్, మేఘాలయ, కర్ణాటకలో ఇలాంటి పరిస్థితులే ఉన్నప్పుడు అసెంబ్లీలో ‘ఫ్లోర్ టెస్ట్’ ( బలనిరూపణ) ద్వారా మెజార్టీ నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం తమిళనాడు టీవీకే పార్టీకి పార్టీకి మెజారిటీ స్థానాలు వచ్చినప్పటికీ, గవర్నర్ ఎందుకు వెనకాడుతున్నారని ఆయన నిలదీశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజల తీర్పుకు గౌరవం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గవర్నర్ పాలన కాదు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండాలని డిమాండ్ చేస్తూ నెట్టింట ఓ పోస్టు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>