Mobile Popup Ad
Mobile Popup Ad

ఇండోనేషియాలో ఘోరం.. 16 మంది సజీవ దహనం

కలం, వెబ్ డెస్క్: ఇండోనేషియాలో (Indonesia) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాన్స్-సుమత్రా హైవేపై ప్యాసింజర్ బస్సు, ఇంధన ట్యాంకర్ పరస్పరం ఢీకొట్టుకున్న ఘటనలో 16 మంది సజీవ దహనం అయినట్లు సమాచారం. బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులు ఉండగా.. నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. మరణించినవారిలో 13 మంది ప్రయాణికులు, బస్సు డ్రైవర్, ట్యాంకర్‌ డ్రైవర్, ఆయన సహాయకుడు ఉన్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

డ్రైవర్ తప్పిదం కారణంగానే..

20 మంది ప్రయాణికులతో ప్రైవేట్‌ బస్సు లుబుక్లింగ్‌గౌ నగరం నుంచి జాంబీకి వెళుతోంది. అదే రోడ్డుపై మరో బస్సులో మంటలు రావడాన్ని గుర్తించిన అప్రమత్తమైన డ్రైవర్‌  బస్సును వెంటనే కుడి వైపునకు తిప్పాడు. ఈ క్రమంలో అటు నుంచి వేగంగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ట్రక్ బస్సును ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. 16 మంది స్పాట్ డెడ్ అయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>