విజయ్‌కి షాకిచ్చిన కమ్యూనిస్టులు

కలం, వెబ్ డెస్క్: టీవీకే చీఫ్ విజయ్‌(Vijay)కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. త్వరలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని.. ఆయన అభిమానులు భావిస్తున్న తరుణంలో వరస ఆటంకాలు ఎదురవుతున్నాయి. విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వం స్థాపించేందుకు కావాల్సిన మెజార్టీ సీట్లు గెలుచుకోలేకపోయింది. దీంతో చిన్నాచితకా పార్టీల మద్దతు కోసం విజయ్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా ఆయనకు మద్దతు ఇచ్చేందుకు కమ్యూనిస్టులు నిరాకరించినట్టు సమాచారం.

ఆ పది స్థానాల మద్దతు కోసం వేట

తమిళనాడులో మొత్తం 234 స్థానాలకుగానూ టీవీకే 108 స్థానాలను గెలుచుకున్నది. మ్యాజిక్ ఫిగర్ 118 కావడంతో విజయ్ పార్టీకి ఇంకో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంది. ఇందుకోసం టీవీకే ప్రతినిధులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఐదు స్థానాలు గెలుచుకున్న  కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. అయినప్పటికీ విజయ్‌కి ఇంకో ఐదు స్థానాలు కావాల్సి ఉంది.

కమ్యునిస్టుల షాక్

విజయ్ స్థాపించిన టీవీకే, కమ్యూనిస్టు పార్టీలకు కొంత భావసారుప్యత ఉండటంతో వారు టీవీకేకు మద్దతు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ చివరినిమిషంలో కమ్యూనిస్టులు బాంబు పేల్చారు. తాము ప్రస్తుత కూటమిలోనే కొనసాగుతామని.. విజయ్ కు మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. దీంతో టీవీకే నేతలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతున్నారు. ఇక అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ పళనిస్వామి మాత్రం టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు నో చెప్పినట్టు సమాచారం. ఇదే సమయంలో ముస్లిం లీగ్ పార్టీ కూడా ప్రస్తుత రాజకీయ కూటమి వైపే నిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాలు టీవీకే ప్రభుత్వ ఏర్పాటు ఆశల మీద నీళ్లు చల్లుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>