కలం, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu) ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ టీవీకే పార్టీ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ప్రధాన పార్టీలను వెనక్కి నెడుతూ కౌంటింగ్‌లో దూసుకుపోతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. విజయ్ కారు డ్రైవర్ కొడుకు శభరినాథన్ (Sabarinathan) విజయం సాధించడం చర్చనీయాంశమవుతోంది. విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి తన వ్యక్తిగత కారు డ్రైవర్, పీఏ అయిన రాజేంద్రన్ కుమారుడు శభరినాథన్‌కు అవకాశం ఇచ్చాడు. అతడిని భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. ప్రత్యర్థి పార్టీల దిగ్గజాలకు దీటుగా శభరినాథన్‌ను బరిలోకి దించారు. ఈ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి ప్రభాకర రాజాపై శభరినాథన్ అద్భుత విజయం సాధించి, శాసనసభలో అడుగుపెడుతున్నారు. తండ్రి డ్రైవర్‌గా సేవలందిస్తే, కొడుకు అదే నాయకుడి అండతో ప్రజలకు సేవ చేసే స్థాయికి ఎదగడం చర్చనీయాంశమవుతోంది.
Read Also: ఓట్ల లెక్కింపు.. ఆర్జీకర్ మృతురాలి తల్లి ముందంజ
Follow Us On: Pinterest

