విజయ్ బర్త్‌డే స్పెషల్.. రణబాలి మేకింగ్ వీడియో రిలీజ్

కలం, సినిమా : స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ (Rahul Sankrityan) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీ “రణబాలి” (Ranabaali). మైత్రీ మూవీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో విజయ్ ఓ పోరాట యోధుడిగా నటిస్తున్నాడు. గతంలో రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో ఈ  సినిమాపై అంచనాలు పెంచేసింది.

నేడు (మే 9) విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ఈ సినిమా (Ranabaali) కోసం విజయ్ గుర్రపు స్వారీ నేర్చుకోవడం చూపించారు. గ్లింప్స్ వీడియోలో విజయ్ హార్స్ రైడింగ్ ఫ్యాన్స్‌కి విపరీతంగా నచ్చింది. అయితే దాని కోసం విజయ్ ఎంతలా కష్టపడ్డాడో మేకింగ్ వీడియోలో చూపించారు.  విజయ్, రష్మిక వివాహం తరువాత వారిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మొదటి మూవీ కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. రణబాలి సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 11న గ్రాండ్ రిలీజ్ కానుంది.

Read Also: బాలయ్య, కొరటాల సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ?

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>