కలం, స్పోర్ట్స్: యంగ్ స్పిన్నర్ విజ్ఞేష్ పుతుర్ (Vignesh Puthur) సరికొత్త రికార్డ్ సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్ మ్యాచ్‌లలో ఒకే మ్యాచ్‌లో 5 క్యాచ్‌లు పట్టడం ఇప్పటి వరకు ఉన్న రికార్డ్. ఈ ఘనత ఒకటి రెండు సంవత్సరాలు కాదు.. 32 సంవత్సరాలుగా ఉంది. దానిని పుతుర్ బ్రేక్ చేశాడు. ఒక మ్యాచ్‌లో ఆరు క్యాచ్‌లు పట్టి అదరగొట్టాడు. దేశవాళీ వన్డే టోర్న్‌మెంట్‌లో పుతుర్ ఈ రికార్డ్ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
బుధవారం త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో కేరళ తరఫున ఆడిన విజ్ఞేష్ పుతుర్(Vignesh Puthur), ఫీల్డింగ్‌లో అదరగొట్టాడు. ప్రత్యర్థి జట్టులోని ఉదియన్ బోస్, స్రిదమ్ పాల్, స్వప్నిల్ సింగ్, సౌరభ్ దాస్, అభజిత్ సర్కార్, వికి సహా వికెట్ల వద్ద అందుకున్న క్యాచ్‌లతో మొత్తం 6 క్యాచ్‌లు పట్టాడు. దీంతో లిస్ట్-ఏ క్రికెట్‌లో ఇది వరకూ ఎవరూ అందుకోని రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు.
ఇప్పటి వరకు ఈ విభాగంలో ఐదు క్యాచ్‌లే గరిష్టంగా నమోదు అయ్యాయి. జాంటీ రోడ్స్ (1993), బ్రాడ్ యంగ్ (2002), పీటర్ హాండ్‌స్కోంబ్ (2023), అరీన్ సంగ్మా (2025), హ్యారీ బ్రూక్ (2025) లు సాధించిన ఐదు క్యాచ్‌ల రికార్డును విజ్ఞేష్ పుతుర్ అధిగమించాడు. 32 ఏళ్లుగా నిలిచి ఉన్న ఆ రికార్డును 6 క్యాచ్‌లతో చెరిపేసి కొత్త అధ్యాయాన్నే రాశాడు.
Read Also: హైదరాబాద్‌లో కైట్ ఫెస్టివల్.. ఎప్పటివరకంటే?
Follow Us On: Sharechat


