కలం వెబ్ డెస్క్ : మహిళలపై వేధింపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా పోకిరీలు మారటం లేదు. తాజాగా కామారెడ్డి(Kamareddy) జిల్లాలో ఓ రాజకీయ నేత వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడటం విమర్శలకు దారితీసింది. ఆ నీచుడికి స్వయంగా బాధితురాలి భర్త దేహశుద్ధి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా బాన్సువాడ(Banswada)లో దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి నెల రోజులుగా ఓ వివాహితను లైంగికంగా వేధిస్తున్నాడు.
అతడి వేధింపులు తట్టుకోలేక బాధితురాలు తన భర్తకు ఫిర్యాదు చేసింది. దీంతో భర్త సదరు వ్యక్తిని పట్టుకొని చితకబాదాడు. శుక్రవారం బాన్సువాడలో (Banswada) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దేవేందర్ రెడ్డి వివాహితను వేధిస్తున్నాడు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న వివాహిత భర్త స్థానికుల సాయంతో దేవేందర్ రెడ్డికి దేహశుద్ధి చేశాడు. నిందితుడిని చెప్పుతో కొడుతూ రోడ్డుపై నడిపిస్తూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Also: నగరంలో దారుణం.. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
Follow Us On: X(Twitter)


