కలం మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ (Vigilance) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. పటాన్‌చెరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించిన పలు రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల్లో భాగంగా కొన్ని కీలక డాక్యుమెంట్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. విజిలెన్స్ అధికారుల తనిఖీలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: కార్పొ’రేట్’ వైద్యం.. తెలంగాణలో ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ
Follow Us On : WhatsApp

