కలం, వెబ్ డెస్క్ : తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (Anantha Babu) ను పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్షులను బెదిరిస్తున్నారని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గ ఇవాళ రాజమహేంద్రవరం కోర్టుకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే కోర్టు నుంచి బయటకు రాగానే ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే ఆయన (Anantha Babu) కోర్టు లోపల ఉన్న సమయంలోనే బయట భారీగా పోలీసులు మోహరించారు. తీర్పు అనంతరం బయటకు రాగానే అనంతబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజా పరిణామంతో రాజమహేంద్రవరం కోర్టు పరిసరాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ పరిస్థితుల్లోనే పోలీసులు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును కాకినాడలోని సర్పవరం పీఎస్‌కు తరలించారు.
Read Also: పెళ్లిలో ఇదో కొత్త ట్రెండ్.. ఈ హైటెక్ మర్యాదలు చూస్తే షాక్!
Follow Us On: Sharechat

