కలం, వెబ్ డెస్క్: నేటి కాలంలో పెళ్లిళ్లు (Wedding) సంప్రదాయాలకు అనుగుణంగా కాకుండా, గొప్ప ఆడంబరాలకు వేదికలుగా మారుతున్నాయి. తాజాగా ఓ వివాహ వేడుకలో అతిథులకు ఆకర్షించేందుకు వినూత్నంగా మర్యాదలు చేయాలని భావించారు నిర్వాహకులు. పెళ్లిలో గ్లామరస్ యువతులను హోవర్‌బోర్డ్‌లపై తిప్పేలా ఏర్పాట్లు చేశారు. ఆ అమ్మాయిలు మోడ్రన్ దుస్తులు ధరించి, గెస్టుల వద్దకు వెళ్లి స్నాక్స్, కూల్ డ్రింక్స్ అందిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతున్నాయి. ఈ ‘హైటెక్’ మర్యాదలను చూసి కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన పెళ్లి వేడుకలో ఇలాంటి అశ్లీలతకు తావిచ్చే ప్రదర్శనలు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. సంప్రదాయాలను దెబ్బతీస్తున్నారంటూ నిర్వాహకులపై మండిపడుతున్నారు.
-న్యూ ట్రెండ్ ఇన్ వెడ్డింగ్!
-గ్లామరస్ యువతులతో హోవర్‌బోర్డ్‌లపై స్నాక్స్ సర్వింగ్
-సోషల్ మీడియాలో వీడియో వైరల్!
-పెళ్లిలో వెస్ట్రన్ కల్చర్ పై నెటిజన్లు ఆగ్రహంHigh-Tech Hospitality: Servers on Hoverboards at Wedding Spark “Show-Off Culture” Debate#WeddingTrends #ViralVideo… pic.twitter.com/RA8v7e9tzB
— Kalam Daily (@kalamtelugu) April 24, 2026
Read Also: అల్యూమినియం టెస్ట్‌తో మీ ఇల్లు సేఫ్..!
Follow Us On: Instagram

