Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే: విద్యాసాగర్ రావు

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్ గడ్డను బీజేపీ అడ్డాగా నిలబెట్టారని బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంలో బండి సంజయ్ పట్టుదల తెలిసిందన్నారు. కరీంనగర్ బీజేపీ శ్రేణుల కసితోనే బల్దియా‌పై కాషాయ జెండా ఎగిరిందనీ పేర్కొన్నారు. ఇలాంటి ఫలితం కోసం తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎదురు చూస్తున్నారన్నారు.

కార్యకర్తలతో కృషితో బీజేపీకి అధికారం

కార్యకర్తల కృషితో రాబోయే రోజుల్లో తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని విద్యాసాగర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం బీజేపీ శిక్షణ తరగతుల ముగింపు (సమరోప్) కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం మీడియా సమావేశంలోనూ మాట్లాడారు. మోదీ ప్రభుత్వ తీరుపై దేశ ప్రజలకు అనలేని విశ్వాసం , నమ్మకం ఏర్పడిందన్నారు.

రేవంత్ స్కిల్ డెవలప్‌మెంట్‌పై ఆలోచించాలి

ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్‌ను ప్రోత్సహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పారని, నేడు ఆ దిశగా ఆలోచన చేయడం లేదన్నారు. యువతను ఆదుకోవడానికి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి మండలానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల కోసం యువత ఎంతగానో ఎదురు చూస్తోందన్నారు.

చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి

స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల వల్ల యువతకు ఉపాధి దొరికి , చెడు వ్యసనాలకు దూరంగా ఉండే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ లను ప్రోత్సహించినప్పుడే ఆర్థికవ్యవస్థ కూడా మెరుగుపడే అవకాశం ఉంటుందన్నారు. వరంగల్లో ఏర్పాటు చేయబోయే టెక్స్ టైల్ పార్కు ఎంతో చరిత్ర ఉందని తెలిపారు. లండన్‌లోని హైడ్ పార్క్ లో జరిగిన ఒక ఎగ్జిబిషన్ లో వరంగల్ కి చెందిన చేనేత దుప్పటి ప్రథమ బహుమతి సాధించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తెలుగు భాషను కాపాడుకుందాం

దేశ భాషలో తెలుగు భాషకు ఎంతో ప్రాధాన్యత ఉందని, అలాంటితెలుగు భాషను పరిరక్షించుకోవాలన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వేములవాడలో పంపకవి జన్మించారని, ఆయనను తెలుగుకు ఆదికవిగా భావించుకుంటున్నామని తెలిపారు. మీడియా సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్ కోలగని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మాజీ జిల్లా అధ్యక్షులు భాష సత్యనారాయణ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి, మేకల ప్రభాకర్ యాదవ్ , బొంతల కళ్యాణ్ చంద్ర, కార్పొరేటర్ రవీందర్, తిమ్మాపూర్ మండల అధ్యక్షులు చింతం శ్రీనివాస్, బీజేవైఎం అధ్యక్షులు గడ్డం అరుణ్, రామిడి మహేందర్, జక్కోజు అనిల్, ఓదెలు, అప్పల శ్రీనివాస్, దూలం కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>