Mobile Popup Ad
Mobile Popup Ad

టాలీవుడ్ వ‌ర్క్ క‌ల్చ‌ర్‌పై జాన్వీ క‌పూర్ కామెంట్స్‌!

క‌లం, వెబ్ డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ క‌పూర్ (Janhvi Kapoor) టాలీవుడ్ వర్క్ కల్చర్‌పై చేసిన కామెంట్స్‌ ఇప్పుడు సినీ వ‌ర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. తెలుగులో దేవర-2, పెద్ది వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్న ఆమె, ఇక్కడి పని గంటలకు ఇచ్చే ప్రాధాన్యతపై ఫిదా అయిపోయింది. ముఖ్యంగా లంచ్ బ్రేక్‌లో అందరూ విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత డ‌బుల్ ఎన‌ర్జీతో పని చేస్తారని, తాను రోజుకు 9 గంటలకు మించి ఎప్పుడూ పని చేయలేదని ఆమె చెప్పుకొచ్చారు. అయితే, గ‌తంలో షూటింగ్ సమయాలపై దీపికా పదుకోణ్‌ చేసిన వ్యాఖ్యలకు జాన్వీ పరోక్షంగా కౌంటర్ ఇచ్చినట్లుగా ఈ కామెంట్స్ కనిపిస్తున్నాయి. ప‌ని గంట‌ల విష‌యంలో వ‌చ్చిన బేధాభిప్రాయాల‌తోనే దీపికా క‌ల్కి-2 నుంచి ఔట్ అయ్యింది. ఒక హీరోయిన్ నెగ‌టివ్‌గా చెప్పిన వ‌ర్క్ క‌ల్చ‌ర్‌పై మ‌రో హీరోయిన్ పాజిటీవ్‌గా రియాక్ట్ అవ్వ‌డంతో నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఇక జూన్ 4న జాన్వీ న‌టించిన పెద్ది సినిమా విడుదల కానుంది. ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ రేపు విజయవాడలో ఘ‌నంగా జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా జాన్వీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>