బాణ‌సంచా పేలుడు ఘ‌ట‌న‌లో మ‌రొక‌రు మృతి

క‌లం, వెబ్ డెస్క్‌: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం(Vetlapalem)లో జ‌రిగిన‌ బాణసంచా పేలుడు ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు 21 మంది ప్రాణాలు కోల్పోగా 15 మంది తీవ్ర గాయాల‌పాల‌య్యారు. వీరంద‌రికీ ఆస్ప‌త్రిలో చికిత్స కొన‌సాగుతోంది. రోజూ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. బుధ‌వారం సాయంత్రానికి 25 మంతి మృతి చెంద‌గా నేడు ఉద‌యం మ‌రొక‌రు ప్రాణాలు కోల్పోవ‌డంతో మృతుల సంఖ్య 26కు చేరుకుంది. ఈ ఘ‌ట‌న‌ బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>