నల్గొండ ప్రిన్సిపాల్ హత్య కేసు.. రంగంలోకి రాష్ట్ర మహిళా కమిషన్!

కలం, దేవరకొండ: నల్గొండ (Nalgonda) జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధిలోని జేబీ కాలనీలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్, డైరెక్టర్ శ్రీమతి కుల్లు రూపా రెడ్డి దారుణ హత్యకు గురైన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని ఈ కేసును కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ దారుణం జరిగి వారం రోజులు గడుస్తున్నప్పటికీ, నిందితులను ఇంకా గుర్తించకపోవడం పట్ల మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి ఆందోళన, తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే గుర్తించి, అరెస్టు చేయాలని నల్గొండ జిల్లా ఎస్పీని కమిషన్ ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి సమగ్ర నివేదికను వెంటనే సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొంది. మహిళలపై జరిగే ఇటువంటి తీవ్రమైన హింసాత్మక ఘటనలపై పోలీసులు అత్యంత ప్రాధాన్యతతో దర్యాప్తు జరిపి, బాధితురాలి కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని చైర్‌పర్సన్ స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తు పురోగతిని మహిళా కమిషన్ నిరంతరం పర్యవేక్షిస్తుందని ఆమె తెలిపారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>