Mobile Popup Ad
Mobile Popup Ad

గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు ప్రత్యేక విమానాలు

కలం, వెబ్ డెస్క్ : గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రత్యేక విమాన సర్వీసులు (Special Flights) ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ సంస్థలు ప్రత్యేక సర్వీసులు నడపనున్నాయి. దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ విమానాలు రానున్నాయి. దుబాయ్, పుజైరా నుంచి ముంబై, ఢిల్లీకి ఈ ప్రత్యేక విమానాలు చేరుకుంటాయి. దుబాయ్, జెడ్డా మీదుగా ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానాలు (Special Flights) చేరుకుంటాయి. ఇప్పటికే పలు సర్వీసులు ఇండియాకు చేరుకున్నాయి. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఆయా దేశాల అధినేతలతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి మాట్లాడారు. భారతీయుల కోసం భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>