మరాఠీలకు శివాజీ.. తెలంగాణకు సర్వాయి పాపన్న: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: బహుజన వీరుడి విగ్రహానికి సముచితమైన స్థానం నెక్లస్ రోడ్ అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ నెక్లస్ రోడ్డుపై ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఇది బహుజనుల తెలంగాణ అని.. గీత కార్మికుల వృత్తి కాపాడే బాధ్యత తమ ప్రభుత్వానిది అని హామీ ఇచ్చారు. అమరవీరుల స్థూపానికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. సర్వాయి పాపన్న విగ్రహానికి అంతే ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకొచ్చారు.

విగ్రహం పెట్టాలని నేనే నిర్ణయించా..

సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలని చాలా ఏళ్లుగా డిమాండ్ ఉందని సీఎం అన్నారు. సర్వాయి విగ్రహం పెట్టాలని బీసీ నాయకులు తనను కోరారని చెప్పారు. అందుకే నెక్లస్ రోడ్డుపై పాపన్న విగ్రహం పెట్టాలని తానే నిర్ణయించినట్లు తెలిపారు. దేశ విదేశాల నుంచి పర్యాటకులు వచ్చి సందర్శించేలా పాపన్న విగ్రహం ప్రతిష్టించామన్నారు. సమసమాజ స్థాపన కోసం పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. మరాఠీలకు ఛత్రపతి శివాజీ ఎలాగో, మన తెలంగాణకు సర్వాయి పాపన్న అలాగే అని స్పష్టం చేశారు. విజయాలు సాధించినా చెప్పుకోలేక పోతున్నామని.. బ్రిటీష్ మ్యూజియంలో పాపన్న వీరత్వం గురించి పుస్తకాలే ఉన్నాయని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>