ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూత

కలం, వెబ్ డెస్క్: ప్రముఖ సినీ నటుడు గిరిబాబు (Actor Giribabu) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించిన గిరిబాబు అసలు పేరు శేషగిరిరావు. తన కెరీర్‌లో 600కి పైగా సినిమాల్లో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్, విలన్‌గా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించగా, నిర్మాతగా కూడా రాణించారు.

1973లో ‘జగమే మాయ’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన గిరిబాబు.. హీరో కావాలని భావించారు. ఆ తరువాత అనేక సినిమాల్లో విభిన్న పాత్రలను పోషించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన భార్య శ్రీదేవి 2016లోనే మరణించారు. ఇద్దరు కమారులు రఘుబాబు, బోస్ బాబు, ఒక కుమార్తె ఉన్నారు. రఘుబాబు కమెడియన్‌గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గిరిబాబు మరణంపై పలువురు నటులు సంతాపం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>