కలం, సినిమా : మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman) అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ డైరక్షన్లో చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ మూవీ (Kaaka Movie) ప్రమోషన్లను డిసెంబర్ 1 నుంచి భారీ స్థాయిలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసిన థమన్.. ఈ సంక్రాంతికి మెగాస్టార్ మాస్ ర్యాంపేజ్ చూడబోతున్నామని, 2027 జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని స్పష్టం చేశారు. ఈ అప్డేట్తో మెగా అభిమానుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. బాబీ, చిరంజీవి కాంబినేషన్లో గతంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

