కలం, నర్సాపూర్ (జి) : మహిళా సంఘాల బలోపేతం, ఆర్థిక స్వావలంబనకు మహిళా సమాఖ్య భవనాలు (Mahila Samakhya Buildings) ఎంతగానో దోహదపడతాయని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) అన్నారు. నర్సాపూర్ (జి) మండలం రాంపూర్ గ్రామంలో రూ. 40 లక్షలతో నిర్మించిన నాలుగు మహిళా సమాఖ్య (వీఓ) భవనాలను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధితో పాటు మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిన్నోళ్ల విజయలక్ష్మి, ఉపసర్పంచ్ కమ్రుద్దీన్, వార్డు సభ్యులు నరేష్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్, నాయకులు ఠాకూర్ అర్జున్, మహిపాల్, రమణారెడ్డి, ముత్యం రెడ్డి, జమాల్, , అనిల్, గోవర్ధన్, శ్రీనివాస్, ప్రణీత్, గ్రామస్తులు పాల్గొన్నారు.

