కేరళలో పోలింగ్.. ప్రముఖ రచయిత కీలక స్టేట్‌మెంట్

కలం, వెబ్ డెస్క్: కేరళ (Kerala) రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మహిళలు, వృద్ధులు కూడా ఎంతో ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖ రచయిత టీ పద్మనాభన్ (Padmanabhan) సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నాకు 97 సంవత్సరాలు. నేను ఇప్పటివరకు ఓటు వేయడం ఒక్కసారైనా మిస్ కాలేదు. అవకాశం ఉంటే వచ్చే సారి కూడా తప్పకుండా ఓటు వేస్తాను.’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కన్నూరులో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎవరీ పద్మనాభన్?

పద్మనాభన్ అసలు పేరు తిన్నక్కల్ పద్మనాభన్ (Padmanabhan) 1931 వ సంవత్సరం ఫిబ్రవరి 5న ఆయన జన్మించారు. మళయాళంలో ప్రముఖ రచయితగా గుర్తింపు పొందారు. కేరళ అత్యున్నత పురస్కరామైన ఎళుతచ్చన్ పురస్కారం సహా అనేక ఇతర పురస్కారాలు ఆయనకు దయ్యాయి. కన్నూరు సమీపంలోని పల్లికున్నలో జన్మించిన పద్మనాభన్ దాదాపుగా 190కి పైగా చిన్నకథలను రచించారు. వాటిలో ఒరు పెన్ కుట్టి అత్యంత ప్రజాదరణ పొందింది. ఆయన రచనలు ఫ్రెంచ్, ఇంగ్లిష్ భాషల్లోకీ అనువాదమయ్యాయి. మానవ సంబంధాలు, భావోద్వేగాలను ాయన ఒడిసిపట్టుకున్నారు. ప్రకృతి, మనిషికి మధ్య సంబంధాలతో ఆయన కథల శైలి సాగుతూ ఉంటుంది.

Read Also: మహిళా రిజర్వేషన్ బిల్లు.. ప్రధాని మోదీ కీలక ప్రకటన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>