ఇంటర్ విద్యార్థులకు జూన్ నుంచి మధ్యాహ్న భోజనం: భట్టి

కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే యంగ్ ఇండియా స్కూళ్లకు (Young India Schools) రూపకల్పన చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు అడుగులేస్తోంది. విద్యరంగానికి బడ్జెట్‌లోనూ భారీగా నిధులు కేటాయించింది. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మధ్యాహ్న భోజనంపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఖమ్మం జిల్లా బోనకల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో భట్టి పాల్గొని మాట్లాడారు. తెలంగాణలోని ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతున్నట్లు ప్రకటించారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో పౌష్టికాహారంతో పాటు విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. ముఖ్యంగా ఇంటర్ విద్యార్థుల సౌకర్యార్థం వారికి కూడా ‘మిడ్ డే మీల్స్’ పథకాన్ని (Mid Day Meal Scheme) ప్రారంభిస్తామని భట్టి (Bhatti Vikramarka) హామీ ఇచ్చారు.

Read Also: కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేదు : ఎమ్మెల్సీ రవీందర్ రావు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>