కలం, వెబ్ డెస్క్ : నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రంపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి (Venu Swamy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో దశమహావిద్యల్లో ఏడో మహావిద్యగా, అత్యంత శక్తివంతమైన దేవతగా భావించే ధూమావతి అమ్మవారి ప్రస్తావన రావడంపై ఆయన హెచ్చరికలు జారీ చేశారు. కథా నేపథ్యంలో అమ్మవారి వాహనమైన కాకి ప్రతీకలు, అలాగే యాక్షన్ సీన్లలో తాంత్రిక మంత్రోచ్ఛారణలతో కూడిన BGM వాడటంపై ఆయన తన ఆందోళనను వ్యక్తం చేశారు.
తంత్ర సంప్రదాయాల్లో అత్యంత ఉగ్రరూపంలో ఉండే పవర్ ఫుల్ దేవతా శక్తులతో ఆడుకోవడం సాధారణ విషయం కాదని, దమ్ము దైర్యం ఉంటేనే ఇలాంటి విషయ జోలికి వెళ్లాలని వేణు స్వామి పేర్కొన్నారు. సినిమా చిత్రీకరణ, నేపథ్య సంగీతంలో ఆధ్యాత్మిక అంశాలను ఉపయోగించేటప్పుడు వాటి ప్రాముఖ్యతను గుర్తించి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కామెంట్స్ నెట్టింట దుమారాన్ని రేపుతున్నాయి.

