బస్సు సౌకర్యం కోసం రెండు గ్రామాల రాస్తారోకో

కలం, వలిగొండ: వలిగొండ (Valigonda) మండలంలోని ఎదుల్లగూడెం, ప్రొద్దుటూరు గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలంటూ రెండు గ్రామాల గ్రామస్తులు సీపీఎం నాయకులతో కలిసి ఉదయం దాదాపు అరగంట పాటు భువనగిరి వలిగొండ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ.. ఎదులగూడెం, ప్రొద్దుటూరు గ్రామాలకు బస్సు సౌకర్యం (Bus Service) ఏర్పాటు చేయాలని అధికారులను, ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేను కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందించడం లేదని అందుకే రాస్తారోకో నిర్వహించమని అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>