గవర్నర్ ప్రసంగంలో కాంగ్రెస్ స్కాముల గురించే ఉంది: BRS మాజీ మంత్రి

కలం, వెబ్ డెస్క్ : గవర్నర్ ప్రసంగంతో (Governor Speech) ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) ఫైర్ అయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం మొత్తం డొల్ల చిత్తు కాగితంతో సమానమని, కొత్తగా వచ్చిన గవర్నర్‌తో ఈ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెప్పించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్కీమ్‌ల గురించి గవర్నర్ ప్రసంగంలో లేదని, కాంగ్రెస్ స్కాముల గురించే గవర్నర్ ప్రసంగం ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకే గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితంతో సమానమని బీఆర్ఎస్ పార్టీ(BRS Party) భావిస్తుందని చెప్పారు.

కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలపై గవర్నర్ ప్రసంగంలో లేదని విమర్శించారు. మహిళలకు ఇస్తామని చెప్పిన రూ. 2,500 గురించి ప్రస్తావనే తేలేదన్నారు. రెండేళ్ల నుంచి మహిళలను మోసం చేస్తూనే ఉన్నారని వేముల (Vemula Prashanth Reddy) దుయ్యబట్టారు. ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 3వ బడ్జెట్ అని.. 60 నుంచి 65 శాతం బడ్జెట్ ముగిసిందని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వానికి ఇక మిగిలింది రెండు బడ్జెట్‌లు మాత్రమేనన్నారు. రూ. 2 లక్షల రుణమాఫీ చేశామని నూతన గవర్నర్‌తో అబద్ధం చెప్పించారని ఆరోపించారు. రైతులకు ఇస్తామని చెప్పిన రూ. 15 వేల రైతు భరోసా గురించి గవర్నర్ ప్రసంగంలో లేదన్నారు.

కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కూడా సరిగ్గా రావడం లేదని రైతులు నిలదీస్తున్నారని గుర్తుచేశారు. రైతులను మోసం చేసే దిశగా ప్రభుత్వం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ ఇవ్వలేదని.. ఇప్పుడేమో ఇచ్చామని గవర్నర్ ప్రసంగంలో చెప్పించారని ఆగ్రహించారు. 12 వేల ఉద్యోగాలు ఇచ్చి 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని గవర్నర్‌తో అబద్ధం చెప్పించారని మండిపడ్డారు. నిరుద్యోగ యువతను నిండాముంచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం చేశారో చెప్పలేదన్నారు. గత ప్రభుత్వంలో చేసిన పనులనే తాము చేశామని గవర్నర్‌తో చెప్పించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు అయ్యేంతవరకు పోరాటం చేస్తూనే ఉంటామని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Read Also: ఈ నెల 30 వరకే అసెంబ్లీ సెషన్.. బీఏసీలో నిర్ణయం

Follow Us On: Facebook

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>