ఈ నెల 30 వరకే అసెంబ్లీ సెషన్.. బీఏసీలో నిర్ణయం

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు (Telangana Budget Session) ఈ నెల 30 వ తేదీ వరకు కొనసాగనున్నాయి. వివిధ పార్టీల నేతలతో కూడిన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (BAC) సమావేశమై ఈ సమావేశాల నిర్వహణ గురించి చర్చించింది. అన్ని పక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఈ నెల 30 వరకు నిర్వహించేలా నిర్ణయం జరిగింది. ఆ ప్రకారం ఈ నెల 20న బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో ప్రభుత్వం తరఫున మంత్రి శ్రీధర్‌బాబు సమర్పించనున్నారు. రాష్ట్ర క్యాబినెట్ ఇటీవల సమావేశమైనప్పుడు రూపొందించుకున్న ప్రాథమిక షెడ్యూలు కూడా మార్చి 30 వరకు కొనసాగించేలా చర్చలు జరిగాయి. మొత్తం 27 అంశాలపై చర్చించాల్సి ఉన్నందున కనీసం ఇరవై రోజుల పాటు నిర్వహించాలని సీపీఐ డిమాండ్ చేసింది. బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీల సభ్యులు సైతం సమావేశాలను మరిన్ని రోజుల పాటు కొనసాగించాలని బీఏసీలో అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పండుగల సందర్భంగా సెలవులు ఇవ్వాలని బీఏసీ డిసైడ్ చేసింది. ఈ నెల 29న ఆదివారమైనప్పటికీ సమావేశాలు కొనసాగేలా నిర్ణయం ఖరారైంది.

Read Also: నందిని సిధారెడ్డికి సాహిత్య అకాడమీ అవార్డు

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>