వెలుగుమట్ల బాధితులకు గుడ్ న్యూస్.. హైకోర్టు కీలక ఆదేశాలు

కలం, ఖమ్మం బ్యూరో : వెలుగుమట్ల (Velugumatla) బాధితుల ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో చూశాం. ఇక్కడ ఇండ్లు కోల్పోయిన బాధితుల్లో 311 మందికి ఇప్పటికే ప్రభుత్వం ప్రభుత్వం స్థలాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. ఫీల్డ్ సర్వేలో 412 కుటుంబాలు అర్హులుగా ఉన్నాయని.. వారికి ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే మిగిలిన బాధితులు హైకోర్టును ఆశ్రయించగా.. ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. వెలుగుమట్లలో ఇండ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ఇండ్లు కట్టిఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

ఈ ఘటనపై స్టేటస్ కో విధించింది కోర్టు. భూదాన్ భూములపై యథాస్థితిని కొనసాగించాలని కోర్టు తెలిపింది. అక్కడ ఇండ్లు నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ఇండ్లు ఇవ్వాలని ఖమ్మం కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్ ను కోర్టు ఆదేశించింది. దీంతో ఈ ఆదేశాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది. వెలుగుమట్లలో (Velugumatla) 742 ఇండ్లను అధికారులు రాత్రికి రాత్రే కూల్చేయడం సంచలనం రేపింది. దేశ వ్యాప్తంగా ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే భూదాన్ భూముల్లో ఉంటున్న వారంతా అర్హులు కాదని.. అందులో బోగస్ సభ్యులు ఉన్నారంటూ ప్రభుత్వం చెబుతోంది. అందుకే కేవలం 311 మందికే ఇండ్లు మంజూరు చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>