Mobile Popup Ad
Mobile Popup Ad

హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనండి: బీజేపీ ఎమ్మెల్యే

కలం, వెబ్ డెస్క్: ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి (Paidi Rakesh Reddy)  సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన మాట్లాడుతూ.. హిందువులు కుటుంబ నియంత్రణ పాటించొద్దని.. వీలైనంత వరకు ఎక్కువమంది పిలల్ని కనాలని పిలుపునిచ్చారు. గతంలో హిందువులు ఏడెనిమిది మంది పిల్లల్ని కనేవారని గుర్తు చేశారు.

హిందువులు కుటుంబ నియంత్రణ పాటించడం దేశానికే నష్టమని చెప్పుకొచ్చారు. దేశంలో ముస్లిం జనాభా పెరుగుతున్నదని వారిని తట్టుకోవాలంటే హిందూ జనాభా పెరగడం అనివార్యమని వెల్లడించారు. అనంతరం మీడియాతో నిర్వహించిన పైడి రాకేశ్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాబోయేది హిందూ ప్రభుత్వమేనని తాను 2 జూన్ 2029న హోమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ఇదే చివరి ప్రభుత్వం అని కాంగ్రెస్‍కు చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలో సీఎం ఎవరనేది తాను మాట్లాడనన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్‍ను ముస్లింలు ఆక్రమించుకోబోతున్నారని వారిని ప్రశ్నించేవారు కరువయ్యారని మండిపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>