కలం, వెబ్ డెస్క్ : టీ20 వరల్డ్ కప్ 2026 (T20 World Cup 2026) కు ముందు భారత్‌కు న్యూజిలాండ్ (New Zealand) గట్టి సవాల్‌గా మారొచ్చని మాజీ భారత పేసర్ వరుణ్ ఆరన్ (Varun Aaron) అంచనా వేశారు. ఉపఖండ పరిస్థితులపై బ్లాక్‌క్యాప్స్‌కు ఉన్న అనుభవం కీలకమని తెలిపారు. స్పిన్‌ను ఎదుర్కొనే బ్యాటింగ్ యూనిట్ న్యూజిలాండ్‌కు బలమని ఆరన్ చెప్పారు. ఐపీఎల్ అనుభవం వల్ల భారత్, శ్రీలంక పిచ్‌లపై అవగాహన పెరిగిందని పేర్కొన్నారు. డారిల్ మిచెల్ (Daryl Mitchell) మంచి ఫామ్‌లో ఉండటం మరో ప్లస్ పాయింట్‌గా తెలిపారు. స్టార్ ఆటగాళ్లు తక్కువగా ఉన్నా, సమష్టి ప్రదర్శనతో న్యూజిలాండ్ తరచూ అంచనాలను తలకిందులు చేస్తుందని ఆయన విశ్లేషించారు. ఫీల్డింగ్‌లో రన్స్ కాపాడగలగడం కూడా వారి ప్రత్యేకతగా చెప్పారు.
బౌలింగ్‌లో స్పిన్, పేస్ రెండింట్లోనూ సమతుల్యం ఉందని, నెమ్మదైన పిచ్‌లపై మిచెల్ సాంట్నర్ కీలకంగా మారతాడని ఆరన్ (Varun Aaron) అభిప్రాయపడ్డారు. అయితే గ్రూప్ దశ సవాలుగా ఉంటుందని తెలిపారు. అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్ల మధ్య స్థిరత్వమే న్యూజిలాండ్‌కు కీలకమని అన్నారు. న్యూజిలాండ్ ఫిబ్రవరి 8న చెన్నైలో అఫ్ఘానిస్థాన్‌తో ఆడే మ్యాచ్‌తో తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.
Read Also: ఇండియా వరల్డ్ కప్ స్క్వాడ్‌పై సెహ్వాగ్ హాట్ కామెంట్స్
Follow Us On: Instagram


