epaper
Wednesday, February 18, 2026
epaper

మేడారంలో లైంగిక దాడి ఆరోప‌ణ‌ల‌పై మ‌హిళా క‌మిష‌న్ విచార‌ణ‌

క‌లం, వెబ్ డెస్క్‌: మేడారం జాత‌ర‌లో (Medaram Jatara) ఓ బాలిక‌పై లైంగిక దాడి జ‌రిగిన‌ట్లు వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై జాతీయ మ‌హిళా క‌మిష‌న్ (NCW) ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దీనిపై త‌క్ష‌ణ‌మే విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లాలోని మేడారంలో జ‌రిగిన స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ జాత‌ర‌లో ఓ బాలిక‌పై ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారంటూ పుకార్లు వ‌చ్చాయి. దీనికి సంబంధించి ప‌లు క‌థ‌నాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ కథనాలను సుమోటోగా పరిగణిస్తూ జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ విజయా రహాట్కర్ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించారు. ఈ విచారణ కమిటీకి ఎన్‌డ‌బ్య్లూసీ సభ్యురాలు డెలీనా అధ్యక్షత వహించనున్నారు. మ‌రో సభ్యురాలిగా నేటర్ కంచన్ కట్టర్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. నేటి నుంచి ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ ప్రారంభం కానుంది.

Read Also: నాలుగు వారాల్లో కంప్లీట్ చేయండి.. డీజీపీ నియామకంపై ‘సుప్రీం’

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>