కేజీబీవీలో గెస్ట్ టీచర్లకు దరఖాస్తుల ఆహ్వానం

కలం, వలిగొండ: వలిగొండ (Valigonda) మండలం కేజీబీవీ(లోతుకుంట)లో గెస్ట్ టీచర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ దుర్గ తెలిపారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, సీఆర్టీ బయోసైన్స్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అర్హతలు ఇలా..

ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుకు ఏదేని డిగ్రీ, బీపీఈడీ ఉండాలని ప్రిన్సిపల్ తెలిపారు. సీఆర్టీ బయోసైన్స్ పోస్టులకు బీఎస్సీ (బిజెడ్‌సీ), బీఈడీ ఉండాలన్నారు. పీఈటీ పోస్టుకు రూ.14వేలు, సీఆర్టీ పోస్టుకు రూ.18 వేలు చెల్లిస్తారని పేర్కొన్నారు. అభ్యర్థుల వయస్సు 18-45 సంవత్సరాలు ఉండాలని, దరఖాస్తులు ఈ నెల 27వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు కేజీబీవీలో అందజేయాలని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>