వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్‌కు బ్రేక్..

కలం, వెబ్ డెస్క్: రాజస్థాన్ రాయల్స్‌కు రాయల్ స్టార్టింగ్ ఇచ్చాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). 17 బంతుల్లో 52 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. 128 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు వైభవ్ కనీవినీ ఎరుగని రీతిలో మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు బాది, చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ అటాక్‌ను ముక్కలు ముక్కలు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 5 కళ్లు చెదిరే సిక్సర్లు ఉన్నాయి. 305.88 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన వైభవ్, చెన్నై ఆశలను ఆదిలోనే చిదిమేశాడు. ముఖ్యంగా మ్యాట్ హెన్రీ, నూర్ అహ్మద్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లను సైతం లక్ష్యం చేయకుండా స్టేడియం నలుమూలల బౌండరీల వర్షం కురిపించాడు.

అయితే, ఈ సునామీ ఇన్నింగ్స్‌కు అన్షుల్ కాంబోజ్ బ్రేక్ వేశాడు. కాంబోజ్ వేసిన ఆఫ్ స్టంప్ వెలుపలి బంతిని వైభవ్ ఎక్స్‌ట్రా కవర్ మీదుగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా, అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌తో దానిని అందుకున్నాడు. అవుట్ అయిన తర్వాత వైభవ్ మైదానం వదిలి వెళ్లడానికి నిరాకరిస్తూ తీవ్ర నిరాశతో వెనుదిరిగాడు. వైభవ్ అవుట్ అయ్యే సమయానికి రాజస్థాన్ స్కోరు కేవలం 6.2 ఓవర్లలోనే 75/1 కు చేరుకుంది. ప్రస్తుతం యశస్వి జైస్వాల్ (18*) క్రీజులో ఉన్నాడు. రాజస్థాన్ విజయం ఇప్పుడు కేవలం లాంఛనంగానే కనిపిస్తోంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>