epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సోనియా ఆరోగ్యం కోసం వీహెచ్​ మృత్యుంజయ యాగం

కలం, వెబ్​ డెస్క్​: కాంగ్రెస్​ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దగ్గు, శ్వాస సమస్యలతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని ఆస్పత్రిలోకి చికిత్స పొందుతున్నారు. వాయు కాలుష్యం కారణంగానే అనారోగ్యానికి గురయ్యారు. సోనియాగాంధీ ఆరోగ్యంగా ఉండాలని పలువురు కాంగ్రెస్​ నేతలు పూజలు చేస్తున్నారు. టీకాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు (V Hanumantha Rao) ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్​ అంబర్‌పేటలోని మహంకాళీ దేవాలయంలో మృత్యుంజయ యాగం నిర్వహించారు. సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని, నిత్యం ఆరోగ్యంగా ఉండాలని వీహెచ్​ ఆకాంక్షించారు.

సీనియర్​ నేత హన్మంతరావుకు ఢిల్లీలో మంచి రాజకీయ సంబంధాలున్నాయి. ముఖ్యంగా సోనియాగాంధీ కుటుంబంతో సత్సంబంధాలున్నాయి. సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో హనుమంతరావు తెలంగాణలో కీలకంగా వ్యవహరించారు. ఆమె హైదరాబాద్ పర్యటనకొచ్చిన ఎన్నో సార్లు విహెచ్​తో ప్రత్యేకంగా ముచ్చటించిన సందర్భాలున్నాయి. ఈ కారణంగానే వీహెచ్​ సోనియాపై ప్రత్యేక అభిమానం చూపుతున్నారు.

V Hanumantha Rao
V Hanumantha Rao

Read Also: మరోసారి వార్తల్లో ట్రంప్ : ప్రపంచ దేశాధినేతలపై సంచలన వ్యాఖ్యలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>