కలం, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) సాంస్కృతిక, చారిత్రక ప్రదేశాలెన్నో ఉన్నాయి. దీంతో పర్యాటకులు యూపీని సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మనదేశ టూరిస్టులను కాకుండే.. విదేశీ పర్యాటకులను యూపీ ఆకర్షిస్తోంది. భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2025లో 137 కోట్లకుపైగా వివిధ రాష్ట్రాల పర్యాటకులు ఉత్తరప్రదేశ్‌ను సందర్శించగా, 3.66 లక్షల మంది విదేశీ పర్యాటకులు సందర్శించారని తెలిపింది.
ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభ మేళ కారణంగా 66 కోట్లకుపైగా భక్తులు తరలివచ్చారు. అయోధ్య, వారణాసి, మధుర బృందావనం లాంటి ప్రాంతాలు పర్యాటకులను విపరీతంగా ఆకర్షించాయి. సాంస్కృతిక శాఖ నిర్వహించే ‘దీపోత్సవ్’, ‘రంగోత్సవ్’, ‘దేవ్ దీపావళి’ ‘మాఘ్ మేళా’ లాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ఉత్తరప్రదేశ్ భారతీయ సంస్కృతి, చరిత్రకు కీలకమైన కేంద్రంగా ఉంది. అయోధ్యలో జరిగిన దీపోత్సవం కార్యక్రమం గిన్నిస్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు జరగడంతో పర్యాటకంగా (Travel) యూపీ అగ్రస్థానంలో నిలిచింది.


