కూతురికి డైవర్స్‌.. సెలబ్రేట్​ చేసుకున్న పేరెంట్స్​, వీడియో వైరల్​

కలం, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) మీరట్‌కు చెందిన వినీత అనే యువతి ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన భర్త నుంచి విడాకులు తీసుకున్న వినీతకు ఆమె తల్లిదండ్రులు అండగా నిలిచారు. ఏడేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికి పుట్టింటికి చేరుకున్న తమ కుమార్తెను చూసి వారు బాధపడలేదు. ఆమెకు దక్కిన స్వేచ్ఛను పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఐ లవ్ మై డాటర్ అని రాసి ఉన్న టీషర్టులను ధరించి, డప్పు చప్పుళ్ల మధ్య డ్యాన్స్ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. విడాకులు అంటే ఏదో ఒక ముగింపు కాదని, ఒక మహిళ తన ఆత్మగౌరవంతో కొత్త జీవితాన్ని ప్రారంభించే మంచి అవకాశమని చాటిచెప్పారు. తల్లిదండ్రులు చేసిన ఈ పనికి నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

విడాకులు (Divorce) తీసుకున్న కుమార్తెల పట్ల తల్లిదండ్రుల దృక్పథంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. గతంలో విడాకులను ఒక సామాజిక కళంకంగా భావించి కుమార్తెలను దూరం పెట్టే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అనేకమంది తల్లిదండ్రులు తమ బిడ్డల ఆత్మగౌరవానికి సంబంధించినదిగా భావిస్తున్నారు. విడాకుల తర్వాత ఒంటరిగా మిగిలిన కుమార్తెలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. మళ్లీ చదువుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. ఉద్యోగాల్లో స్థిరపడేలా అండగా నిలుస్తున్నారు. ఈ సానుకూల ధోరణి వల్ల మహిళలు వైవాహిక బంధం విచ్ఛిన్నమైనా కుంగిపోకుండా, కొత్త జీవితాన్ని ధైర్యంగా ప్రారంభించగలుగుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>