తెలంగాణలో తీవ్ర విషాదాలు

కలం, వెబ్ డెస్క్: నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. మహాలక్ష్మి వాడలోని ఓ ఇంట్లో ఫ్రిడ్జ్‌లో ఒక్కసారిగా మంటలు (Fridge fire) చెలరేగాయి. ఈ ఘటనలో విజయ్‌, మరో మహిళకు తీవ్రగాయాలు కాగా, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. షార్ట్‌సర్క్యూట్‌ వల్లే ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మంచిర్యాల జిల్లా చెన్నూరు గురుకుల పాఠ‌శాల‌లో ఆదివారం విషాద ఘటన జరిగింది. 15 ఏళ్ల గురుకుల విద్యార్థిని డేటాల్ తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం (Suicide attempt) చేసింది. వెంటనే స్థానికులు సదరు విధ్యార్థినిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్ప‌త్రికి త త‌ర‌లించారు. నెల రోజుల క్రితం కూడా ఓ బాలిక ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. ఆ ఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే మరో ఘటన వెలుగు చూడటంతో స్థానికంగా చర్చించుకుంటున్నారు. బాలిక ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>