కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను వారం రోజుల్లో జూన్ 4, 5 తేదీలోగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. శనివారం మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ధాన్యం కొనుగోలు అంశంపై మంత్రులు జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి.చిన్నా రెడ్డిలతో కలిసి మంత్రి ఉత్తమ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, డిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి జితేందర్ రెడ్డి,ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జె.అనిరుధ్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, అచ్చం పేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణ పేట, గద్వాల, వనపర్తి జిల్లాల కలెక్టర్లు ఖుష్బూ గుప్తా, హేమంత్ కేశవ్ పాటిల్, సి.హెచ్.ప్రియాంక, ఆదర్శ్ సురభి, రిజ్వాన్ బాషా షేక్,, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన కలెక్టర్లు ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు, నిల్వ, రవాణా ప్రక్రియలపై మంత్రులకు వివరించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలోని పలు ఉమ్మడి జిల్లాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు జిల్లా ఇంచార్జి మంత్రులు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితరులతో కలిసి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యం లోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని 29 రాష్ట్రాల్లో రైతులకు మేలు చేసింది తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అన్నారు.దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యధిక వరి ధాన్యం పండించి తెలంగాణ రాష్ట్రం దేశం లో నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు. వరి,మొక్క జొన్న ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు నష్ట పోకుండా తడిసిన ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలించినట్లు తెలిపారు.
వాతావరణ శాఖ జూన్ 4వ తేదీ తర్వాత వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించిన నేపథ్యంలో వారం రోజుల్లోగా జూన్ 4, 5 తేదీల్లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. కొనుగోలు, రవాణా, నిల్వ, రైతులకు చెల్లింపుల ప్రక్రియను సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇసుక రవాణాకు వినియోగిస్తున్న లారీలను వారం రోజులు తాత్కాలికంగా ధాన్యం రవాణాకు మళ్లించాలని సూచించారు. అవసరమైతే లారీలు, డీసీఎంలను రిక్విజిషన్ చేసి ధాన్యం తరలింపునకు వినియోగించాలని ఎస్పీలు, ఆర్టీఏ అధికారులకు సూచించారు. హమాలీల కొరత కొన్ని చోట్ల ఉందని,పశ్చిమ బెంగాల్ ,బీహార్ రాష్ట్రం నుంచి హమాలీ లు పని చేస్తారని,హమాలీలు అదనంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ యాసంగి లో 66 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం సాగు చేయగా 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించారు. ఇందులో రాష్ట్రం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకుందని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు అదనంగా వచ్చిన ప్రతి గింజను కొనుగోలు కు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఎం.ఎస్.పి విధానం ప్రకటించి 51 లక్షల మెట్రిక్ టన్నుకు కేంద్రం ప్రభుత్వం కొనుగోలు చేయగా రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు తగ్గకుండా ఎంత ధాన్యం వచ్చినా కొనుగోలు చేస్తుందని తెలిపారు. కేంద్రం ఎం.ఎస్.పి విధానానికి రాష్ట్ర ప్రభుత్వం 16479 కోట్ల రూ.లు అదనంగా ఖర్చు పెట్టీ ధాన్యం కొనుగోలు చేసిందని తెలిపారు. రాష్ట్రంలో 8575 కొనుగోలు కేంద్రాలు ,13 వేల వాహనాలు,రెండు లక్షల మంది సిబ్బంది,2008 రైస్ మిల్లులు భాగస్వామ్యులు అయ్యారని,20 కోట్ల 80 లక్షల గన్ని సంచులు సరఫరా చేశామని తెలిపారు. ఈ రోజు వరకు 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు..ఈ యాసంగి కి 111500 కోట్ల రూ.లు సుమారు 8 లక్షల 75 వేల మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.8575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా 2255 కొనుగోలు కేంద్రాలు లో కొనుగోలు పూర్తి చేసినట్టు తెలిపారు.దేశంలో తెలంగాణ వరి ఎక్కువ కొనుగోలు చేస్తుందని,కేంద్రం ప్రభుత్వం రాష్ట్రంలో పండిన వరి ధాన్యం లో 38 శాతం మాత్రమే కొనుగోలు చేస్తుందని అన్నారు.కేంద్రం కొనకున్న 16479 కోట్ల రూ.లు చెల్లించి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తుందని అన్నారు.
కొనుగోలు చేసిన వరి ధాన్యం కు గతంలో నెలల తరబడి చెల్లింపు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 48 నుంచి 72 గంటల్లోనే వేగంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుందన్నారు 2024-25 ఖరీఫ్ , రబీ కలిపి 36,148 కోట్ల రూ.లు,2025-26 ఖరీఫ్,రబీ కి కలిపి 39,359 కోట్ల రూ.లు రైతుల ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు
అతి పెద్ద రాష్ట్రం 23 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా,తమిళ నాడు 11 లక్షల మెట్రిక్ టన్నుల మాత్రమే కొనుగోలు చేయగా జిల్లాల వారీగా గోదాములలో నిల్వ స్థలాల కేటాయింపుపై పరస్పర సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన రైస్ మిల్లులకు వెంటనే తరలించాలని, రైతులకు ఇబ్బంది కలిగించేలా తాలు, తరుగు పేరుతో కోతలు విధించే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణా రావు మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ లో ధాన్యం సేకరణ పై ప్రజా ప్రతినిధులు,అన్ని శాఖల అధికారులతో సమీక్ష చేసినట్లు,గోదాం ల సమస్య ఉందని,ప్రైవేట్,పంక్షన్ హాల్ లను కూడా తీసుకుని ధాన్యం నిల్వ చేయాలని సూచించినట్లు తెలిపారు. కొనుగోలు తర్వాత రైతు,ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జి లు ట్రాక్ షీట్ కు మిల్లులకు పోనవసరం లేదని అన్నారు.ప్రతి కొనుగోలు కేంద్రం కి ఒక అధికారిని నియమించి మానిటర్ చేయాలని అన్నారు. టార్పాలిన్ లు ఎక్కువగా కొనుగోలు చేసే అందుబాటులో ఉంచాలన్నారు రాష్ట్ర పశు సంవర్థక శాఖ,మత్స్ర,పాడి అభివృద్ధి,క్రీడలు యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీ హరి మాట్లాడుతూ ప్రభుత్వం సాహాసో పేత నిర్ణయం తో పండించిన వరి ధాన్యం కొనుగోలు చేస్తుందని అన్నారు కొందరు ప్రభుత్వం ను అభాసు పాలు చేయటానికి విమర్శలు చేస్తున్నారని,అందరూ కలిసికట్టుగా తిప్పి కొట్టాలని అన్నారు.
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నా రెడ్డి మాట్లాడుతూ ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లు రాజకీయ పలుకుబడి ఉన్న వారికి కాకుండా లారీలు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు అప్ప చెప్పేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ధాన్యం సేకరణలో జిల్లా కలెక్టర్ లు,అధికారులు అభినందించారు. ప్రభుత్వ విప్,మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి,కేంద్ర ప్రభుత్వం సహకరించుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ దిగ్విజయం గా పూర్తి చేసిందని అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వనపర్తి జిల్లా మినహా మిగతా జిల్లాల్లో 2,3 రోజుల్లో పూర్తి అవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి, పౌర సరఫరాల మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటూ అధికారులను అప్రమత్తం చేస్తూ ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేలా కృషి చేశారన్నారు. రికార్డ్ స్థాయిలో సేకరణ జరిగిందన్నది కాదనలేని సత్యం అన్నారు. రైతులకు సకాలంలో చెల్లింపులు జరగటంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా 5 కోట్ల 34 లక్షల చెక్కును మహిళా సంఘాలకు కమిషన్ గా చెక్కును మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

