Mobile Popup Ad
Mobile Popup Ad

తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ్

కలం, కరీంనగర్ బ్యూరో: అకాల వర్షాలకు తడిసిన ధాన్యంతో సహా రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లాలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష చేశారరు. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, రామగుండం, భూపాలపల్లి ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్, సత్యనారాయణ రావు కూడా పాల్గొన్నారు. ముందుగా పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,885 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తామన్నారు. ఇప్పటి వరకు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా.. మరో 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు 8 లక్షల మంది రైతులకు రూ.11వేల కోట్లు చెల్లించినట్లు వివరించారు.

విడ్డూరంగా బీజేపీ నేతల ప్రచారం..

దేశంలో ఎక్కడ లేని విధంగా రికార్డు స్థాయిలో ధాన్యం, మక్కలు కొనుగోలు చేశామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. బీజేపీ నేతల ప్రచారం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం 51లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి మాత్రమే మద్దతు ధర చెల్లించిందన్నారు. మిగిలిన 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించిందన్నారు. డిసెంబర్ 2023 తర్వాత కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వమే రూ.16,470 కోట్లు చెల్లించినట్లు వివరించారు. ధాన్యం కొనుగోలు పూర్తయ్యే వరకు ఇసుక క్వారీలు నిలిపివేసి, లారీలను ధాన్యం తరలింపునకు వాడాలని అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లాలో ధాన్యం సేకరణకు చొరవ చూపిన అధికారులు, మిల్లర్లు, ప్రజాప్రతినిధులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>