Mobile Popup Ad
Mobile Popup Ad

సిద్దిపేట ఓట్ల పై నివేదిక ఇవ్వండి… ఎన్నికల సంఘం ఆదేశం

కలం, మెదక్ జిల్లా: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో 50 వేలకు పై చిలుకు ఓట్లు ఆన్ మ్యాప్ ఉండటంతో ఓటర్ల జాబితా సరిగా లేదని వచ్చిన పిర్యాదు పై స్పందించిన ఎన్నికల సంఘం.. సిద్దిపేట ఓట్ల అంశంపై విచారణ జరపాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కు (Siddipet Votes Inquiry ) ఆదేశాలు ఇచ్చింది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నుండి పోటీ చేసిన చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితా ప్రకారం సిద్దిపేట టౌన్ లో ఒక లక్ష 12 వేల ఓట్లు ఉన్నాయని, కానీ అందులో 56,408 ఓట్లు ఆన్ మ్యాప్ ఓట్లుగా చూపిస్తుండటం పలు అనుమానాలకు, అక్రమాలు జరిగినట్టు ఉందని భారత, తెలంగాణ ఎన్నికల సంఘం కు, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి పిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం …సిద్దిపేట నియోజకవర్గంలో ఓట్ల అవకతవకలపై వచ్చిన పిర్యాదుపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>