Mobile Popup Ad
Mobile Popup Ad

బాలికపై సర్పంచ్ భర్త అత్యాచారయత్నం!

కలం, వరంగల్ బ్యూరో: ములుగు (Mulugu) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలిక‌ (Minor girl) పై స‌ర్పంచ్‌ భ‌ర్త అత్యాచారయ‌త్నం చేసిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. కన్నాయిగూడెం మండలంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మండ‌లంలోని ఓ గ్రామంలో బాలికపై సర్పంచ్ భర్త శ్రీకాంత్ అత్యాచారయత్నం చేశారు. స్థానిక ఎస్సై వెంక‌టేశ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గ్రామంలో ఇంట‌ర్ చ‌దువుతున్న ఓ బాలిక త‌ల్లిదండ్రుల మాట విన‌డం లేదు. ఈ విష‌య‌మై బాలికను భ‌య‌పెట్టి, ఆమెకు బుద్ధి చెప్పాల‌ని కుటుంబసభ్యులు ఊరి పెద్ద శ్రీకాంత్‌ను కోరారు. ఈ క్రమంలో ఓ రోజు మధ్యాహ్నం వారి ఇంటికి వెళ్లిన శ్రీకాంత్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక దాడికి యత్నించాడు. బాలిక ప్రతిఘటించి బయటకు వచ్చి కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>