కలం, వెబ్ డెస్క్: బాబర్, షాహీన్‌కు ఉస్మాన్ తారిక్ (Usman Tariq) ఫుల్ సపోర్ట్ ప్రకటించారు. భారత్ చేతిలో పాక్ చిత్తు, చిత్తు కావడంతో బాబర్, షాహీన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. వారి ఫామ్ గురించి అనేక మంది అనేక ప్రశ్నలు లేవనెత్తారు. 2021 తర్వాత షాహీన్ ఎప్పు ఇంపాక్ట్ ఫుల్ బౌలింగ్ చేశాడో చెప్పాలంటూ పాకిస్థాన్ మాజీ ప్లేయర్లు నిలదీస్తున్నారు. అదే విధంగా బాబర్‌కు కూడా టీ20 కెరీర్ ముగిసే అవకాశాలు ఉన్నాయని మరికొందరు అంచనాలు వేస్తున్నారు. ఇలాంటి సమయయంలోవారిద్దరికీ పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ అండగా నిలిచారు. బుధవారం సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో నమీబియాతో టీ20 ప్రపంచకప్ మ్యాచ్ జరగనుంది. ప్రెస్ మీట్‌లో తారిక్ మాట్లాడుతూ బాబర్, షాహీన్ జట్టుకు ఎన్నో విజయాలు అందించారని గుర్తుచేశారు. గెలుపు, ఓటమి ఆటలో భాగమని చెప్పారు.
భారత్ మ్యాచ్‌లో బాబర్ ఐదు పరుగులు మాత్రమే చేశాడు. షాహీన్ రెండు ఓవర్లలో 31 పరుగులు ఇచ్చాడు. దీనిపై వచ్చిన విమర్శల మధ్య జట్టు బలంగా తిరిగి వస్తుందని తారిక్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి మ్యాచ్ తర్వాత లోపాలపై సమీక్ష జరుగుతుందని చెప్పారు. తప్పులను సరిదిద్దడంపైనే దృష్టి పెట్టామని తెలిపారు. ఒత్తిడి సహజమని, దాన్ని నియంత్రించగలమని స్పష్టం చేశారు. గ్రూప్ ఏలో పాకిస్థాన్ రెండు విజయాలు, ఒక ఓటమితో మూడో స్థానంలో ఉంది. నెట్ రన్‌రేట్ -0.403. నమీబియాపై గెలిస్తే ఆరు పాయింట్లతో సూపర్ ఎయిట్ దశకు చేరే అవకాశం ఉంది.
Read Also: సూపర్ 8లో టీమ్ ఇండియా షెడ్యూల్ ఫిక్స్
Follow Us On: X(Twitter)


