epaper
Wednesday, February 18, 2026
epaper

సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగిన వెంకన్న

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక మేడే కాలనీలో నివసిస్తున్న లకావత్ వెంకన్న అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడం.. ప్రశ్నించినందుకు కేసుల పాలవడంతో, విసుగు చెంది సెల్ఫీ వీడియో తీసుకుంటూ లకావత్ వెంకన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

గతంలో సారపాకలో ఆటో నడుపుతూ జీవనం సాగించిన వెంకన్న, ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లి కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ మధ్య తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తెలిసి కుమిలి పోయాడనీ, కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయమై నిలదీయడంతో, జైపాల్ రెడ్డి అనే వ్యక్తి తనపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేశాడనీ, పోలీసులు కూడా అతనికే వత్తాసు పలకడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకన్న.. సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. దీనితో అతడిని వెంటనే భద్రాచలం (Bhadrachalam) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: ప్రత్యూష విషాదాంతం.. అలుపెరుగని అమ్మ పోరాటం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>