కలం, వెబ్ డెస్క్ : యూఎస్ఏ (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా) క్రికెట్ జట్టు (USA Cricket Team) సభ్యులు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. జట్టు కెప్టెన్ మోనాంక్ పటేల్ నేతృత్వంలో సభ్యులు మిలింద్ కుమార్, సౌరభ్ నేత్రావల్కర్ మంగళవారం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతర్జాతీయ క్రికెట్ సంచలనాలు సృష్టిస్తున్న అమెరికా జట్టు టీ20 వరల్డ్ కప్ కోసం భారత్ లో పర్యటిస్తోంది. మ్యాచ్ విరామ సమయంలో ఆధ్యాత్మిక సేవలో భాగంగా తిరుమల కొండకు చేరుకున్నారు. ఫిబ్రవరి 15న నమీబియాతో జరిగిన మ్యాచ్ ఆ జట్టును అమెరికా చిత్తుగా ఓడించింది. గ్రూప్ ఏ లో ఉన్న యూఎస్ ఇప్పటికే అన్ని మ్యాచులు ఆడి నాలుగు పాయింట్లు సాధించింది.
Read Also: తొర్రూర్లో ఉద్రిక్తత.. మాజీ స్పీకర్ హౌస్ అరెస్ట్..
Follow Us On: Instagram


